LOADING...
Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా
పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా

Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్‌ 20 నుంచి టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్‌ లైనప్‌పై మాజీ బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ధీమా వ్యక్తం చేశారు. భారత యువ బౌలింగ్‌ దళం ఇంగ్లండ్‌ పిచ్‌లకు త్వరగా సరిపోలుకుని తమ రిథమ్‌ను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించగల వారు కావడంతో, వారు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లతోనే ఇంగ్లండ్‌లో ప్రభావం చూపగలరని ఆయన అభిప్రాయపడ్డారు. 'పిచ్‌పై దృష్టి పెడితే విజయం సాధ్యమే. స్పీడ్ కంటే కంట్రోల్ ముఖ్యం. యువ బౌలర్లకు టాలెంట్ ఉంది. గెలవాలన్న తపన ఉంది. కాస్త ఓపికగా ఆడితే, ఇంగ్లండ్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తగలుగుతారని భరత్‌ అరుణ్‌ పేర్కొన్నారు.

Details

పేసర్లు రాణించాలి

ఈ అభిప్రాయాన్ని మాజీ భారత బౌలర్‌ అశిష్‌ నెహ్రా కూడా పంచుకున్నారు. 'ఇంగ్లండ్‌ పర్యటన ఎప్పటికీ ఓ సవాలే అయినా, మన బౌలింగ్‌ దళంలో స్థిరత ఉంది. వారు అక్కడి పరిస్థితులకు తగిన విధంగా తమ ఆటను రూపొందించగలరని నెహ్రా పేర్కొన్నారు. ప్రస్తుత టెస్ట్‌ జట్టులో ఫాస్ట్ బౌలర్లలో జస్పిత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌లకు మాత్రమే ఇంగ్లండ్‌ టెస్టుల్లో గత అనుభవం ఉంది.

Details

యువ బౌలర్లపై కోచ్ లు నమ్మకం ఉంచాలి

స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు మాత్రమే ఇంగ్లండ్‌లో టెస్ట్‌ మ్యాచులు ఆడారు. అయితే బుమ్రా వర్క్‌లోడ్‌ కారణంగా సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌లు ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ అనుభవం కలిగి ఉన్నా, టెస్ట్‌ అనుభవం మాత్రం లేదు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఇంగ్లండ్‌లో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో యువ బౌలర్ల సామర్థ్యంపై నమ్మకంతో కోచ్‌లు ఉన్నారు.