
SRH vs RR: ఉప్పల్‌లో క్రికెట్ హీట్.. నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు హోమ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది.
నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య పోరు మళ్లీ రసవత్తరంగా మారనుంది.
మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. హోమ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
Details
రాజస్థాన్ కంటే బలంగా సన్ రైజర్స్
సన్‌రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ వంటి స్టార్లు ఉన్నారు.
రాజస్థాన్ జట్టులో శాంసన్, యసశ్వీ జైస్వాల్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, హసరంగ, తీక్షణ, జురేల్, ఆర్చర్ లాంటి పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు.
మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో 2,700 మంది పోలీసులు భారీ బందోబస్తు, 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్ బృందాలు మోహరించారు. SRH మెరుగైన ప్రదర్శన చేసి విజయంతో సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని పట్టుదలగా ఉంది.
రాజస్థాన్‌తో పోల్చితే సన్‌రైజర్స్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు.