Cricket in Olympics : ఇక ఒలంపిక్స్ లోను క్రికెట్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆ రోజే?
మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందురూ టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలు ప్రారంభమైతే క్రికెట్ అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ కు తీపి కబురు అందింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించాలని ఒలింపిక్ కమిటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2028లో లాస్ ఎంజిలాస్‌లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కొత్తగా టీ20 క్రికెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
కేవలం ఐదు జట్లకే మాత్రమే ఛాన్స్!
ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 8న ఒలింపిక్ అసోషియేషన్ మీటింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే టీ20 క్రికెట్ ను ఒలింపిక్ క్రీడల్లో చేర్చడంపై ఫైనల్ డెసిషన్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆడే అన్ని దేశాలకు చోటు కల్పించకుండా కేవలం ఐదు జట్లకు మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రతిపాదికన ఈ జట్లను సెలెక్ట్ చేస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2022లో మొదటిసారిగా కామన్ వెల్త్ గేమ్స్‌లో ప్రయోగాత్మకంగా ఉమెన్స్ క్రికెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.