Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు. జింబాబ్వే జట్టుకు 2000 నుంచి 2004వరకు హీత్ స్ట్రీక్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 65టెస్టు మ్యాచులు, 189వన్డే మ్యాచులాడిన హీట్ స్ట్రీక్, టెస్టుల్లో 100వికెట్లు తీసుకున్న తొలి జింబాబ్వే ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటికీ టెస్టుల్లో 100వికెట్ల మైలురాయిని జింబాబ్వేలో ఇంకెవ్వరూ చేరుకోలేకపోయారు. జింబాబ్వే జట్టును ఎన్నోసార్లు ఒంటి చేత్తో గెలిపించిన ఘనత హీత్ స్ట్రీక్ కి దక్కింది. హీత్ స్ట్రీక్ మరణ వార్తను హీత్ స్ట్రీక్ స్నేహితుడు మాజీ బౌలర్ హెన్రీ ఒలంగా ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.