
Yashasvi Jaiswal: ముంబై బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ సంచలన క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని X (టెన్) బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ₹5.38 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలోని ఈ అపార్ట్మెంట్ పరిమాణం 1,100-చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంది.
2024 జనవరి 6న జైస్వాల్ పేరిట ఆస్తి ఒప్పందం నమోదైంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదోహికి చెందిన 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ కి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే బాగా ఇష్టం.
అయితే అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండడం, కారణంగా అతడికి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు.
అయితే యశస్వి 13 ఏళ్ల వయసులో సొంతూరు నుండి ముంబైకి మకాం మార్చారు.
Details
ముంబై అండర్-19 జట్టుకు ఎంపిక
ముంబైకి వచ్చిన కొత్తలో టెంట్‌లో నివసించాడు.డబ్బు సంపాదించడం కోసం పలు దుకాణాల్లో పనిచేసేవాడు.
యశస్వి ఆటని చూసిన కోచ్ జ్వాలా సింగ్ చేరదీసి అతడి నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు.
దాంతో యశస్వి.. ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అండర్-19, దేశవాళీ టోర్నీలలో అతడు అద్భుతంగా ఆడుతుండడంతో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడే అవకాశం వచ్చింది.
2023 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరుపున 14 మ్యాచుల్లోనే 625 పరుగులు చేశాడు. దాంతో టీమిండియాలో చోటు దక్కింది.
గతేడాది వెస్టిండీస్ పర్యటనతో తొలి టెస్టు ఆడిన యశస్వి సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు.
తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వరుసగా సెంచరీలు చేసి మూడు టెస్టుల్లోనే 545 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబల్ సెంచరీలు ఉన్నాయి.