
Anaya Bangar: "క్రికెటర్లు నాకు నగ్న ఫోటోలు పంపారు": జెండర్ సర్జరీ చేయించుకున్న సంజయ్ బంగర్ కుమారుడు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగార్ కుమార్తె అనయా బంగార్ ఇటీవల కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.
మొదట ఆర్యా బంగార్‌గా పిలువబడిన ఆమె, ఒక అథ్లెట్‌గా, వయో గ్రూప్ క్రికెట్‌లోనూ పాల్గొన్నారు.
అనంతరం ఆమె జెండర్ మార్చే శస్త్రచికిత్స (జెండర్ సర్జరీ) చేయించుకున్నారు. తన పేరును 'ఆర్యా' నుండి 'అనయా బంగార్'గా మార్చుకున్నారు.
ఈ లింగ మార్పు చికిత్స తర్వాత తన క్రికెట్ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం అనయా బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు.
వివరాలు
క్రికెట్ వాతావరణంలో భద్రత లేదు
లలన్‌టాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయా మాట్లాడుతూ, క్రికెట్ ప్రపంచంలో పురుషాధిక్యం తీవ్రమైన విషంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల వయసులోనే తాను తల్లి దుస్తులు వేసుకునేదాన్నని, తల్లి కప్బోర్డులో నుంచి తీసుకుని అద్దంలో చూసుకుంటూ తాను అమ్మాయినని, అమ్మాయిగా ఉండాలనుకునేదాన్నని చెప్పారు.
తన క్రికెట్ ప్రస్థానంలో చాలా మంది పేరున్న క్రికెటర్లతో ఆడిన అనుభవాన్ని గుర్తుచేశారు.
ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడినట్టు తెలిపారు.
తన తండ్రి సంజయ్ బంగార్‌కు ఉన్న ప్రఖ్యాతి వల్ల తన అసలైన భావాలను గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని, క్రికెట్ వాతావరణంలో భద్రత లేనివిషయాన్ని, పురుషుల అహంకారం ఉందని తెలిపారు.
వివరాలు
కొంతమంది ఆటగాళ్లు.. నగ్న ఫోటోలు పంపించేవారు
జెండర్ మార్పు అనంతరం తన సహక్రీడాకారుల స్పందన గురించి మాట్లాడుతూ, కొందరు మద్దతు తెలిపినప్పటికీ, కొన్నిచోట్ల వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు.
ఈ వేధింపుల గురించి వివరిస్తూ, కొంతమంది ఆటగాళ్లు తాను కోరకపోయినా తరచూ నగ్న ఫోటోలు పంపించేవారని వెల్లడించారు.
ఒక వ్యక్తి తనతో దురుసుగా ప్రవర్తించాడని, అందరి ముందు తిట్టేవాడని, అదే వ్యక్తి మళ్లీ వచ్చి తన ఫోటోలు అడిగేవాడని చెప్పారు.
ఇంకొక ఘటనగా, భారతదేశంలో ఉన్నప్పుడు తన స్థితి గురించి ఒక మాజీ సహక్రీడాకారుని చెప్పినప్పుడు, అతను కారులో తీసుకెళ్లి తనతో సంబంధం పెట్టుకోవాలని అన్నాడని వెల్లడించారు.
వివరాలు
ఇస్లామ్ జింఖానా క్లబ్ తరపున క్రికెట్
సంజయ్ బంగార్ మాదిరిగా అనయా కూడా ఇస్లామ్ జింఖానా క్లబ్ తరపున క్రికెట్ ఆడారు.
అలాగే, బ్రిటన్‌లో లీసెస్టర్ హింక్లే క్రికెట్ క్లబ్ తరపున కూడా ఆడారు.
అయితే, ఇటీవలి కాలంలో అనయాకు ఐసీసీ నుంచి ఒక నిరాశ కలిగించే నిర్ణయం ఎదురైంది.
ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళా క్రికెట్‌లో పాల్గొనలేరని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టంచేసింది.
ఈ నిబంధనపై తన అసంతృప్తిని తెలియజేస్తూ, అనయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు కూడా చేశారు.