
BCCI: క్రిప్టో వ్యాపారాలు, నిషేధిత బ్రాండ్లు స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తు చేయొద్దు: బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఇటీవలే పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో, టీమిండియా (Team India) జెర్సీ స్పాన్సర్‌గా డ్రీమ్11 ఇకపై అవకాశాల నుంచి తప్పింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) నూతన స్పాన్సర్‌ను ఎంపిక చేయడానికి చర్యలు ప్రారంభించింది. మంగళవారం బీసీసీఐ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కంపెనీలను దరఖాస్తు చేయమని ఆహ్వానిస్తూ, పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయితే దరఖాస్తు చేసుకునే కంపెనీలకు కచ్చితమైన షరతులు విధించారు. ముఖ్యంగా, ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను ఎలాంటి పరిస్థితులలోనూ ఉల్లంఘించకూడదు.
Details
సెప్టెంబర్ 9నుంచి ఆసియా కప్ ప్రారంభం
స్పాన్సర్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్ వంటి కార్యకలాపాలతో ప్రత్యక్ష లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండకూడదు. ఇవి కేవలం భారత్‌లో కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉండకూడదు. అంతేకాక, క్రిప్టో వ్యాపారాలు - క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్స్చేంజ్, క్రిప్టో టోకెన్స్ - లో కూడా పాల్గొనకూడదు. అలాగే నిషేధిత బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలు కూడా ఈ బిడ్‌లో పాల్గొనరాదు. బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది, స్పాన్సర్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీల వార్షిక టర్నోవర్ కనీసం రూ.300 కోట్లుగా ఉండాలి. దరఖాస్తులు సెప్టెంబర్ 16 వరకు సమర్పించుకోవచ్చును. ఆసియా కప్ 2025 యూఏఈ వేదికపై సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది.