Rohit Sharma: యువ ఆటగాడి కల సాకారం చేసిన రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
యువ క్రికెటర్ ఆయుష్ మాత్రేకు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే అపారమైన అభిమానం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మాత్రే, రోహిత్‌ను కలిసిన అనుభవాలను పంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో చెన్నై జట్టు పోటీపడనుండగా, ఆ సందర్భంలో ఈ సంఘటనను వివరించాడు. సీఎస్‌కే ఈ విషయానికి సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా వేదికలలో విడుదల చేసింది. మాత్రే మాట్లాడుతూ.. అది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన విషయం. తాను రోహిత్‌ను కలవాలని మెసేజ్ చేయగా, కొద్దిసేపటికే రోహిత్ స్వయంగా కాల్ చేశారని అన్నారు. 'సరే, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు' అని ఆయన మాట్లాడినట్లు తెలిపారు.
వివరాలు
కల నిజమైన వేళ..
అప్పుడు మాత్రే తాను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోతున్నానని, వెళ్లే ముందు ఒకసారి కలవాలని ఉందని తెలిపాడు. రోహిత్ అతను ఎక్కడ ఉంటున్నాడని అడగగా, తాను విరార్‌లో ఉంటున్నానని చెప్పాడు. రోహిత్ వీడియో కాల్‌లో మాట్లాడుదామని సూచించినా, ప్రత్యక్షంగా కలుసుకోవాలనే తన కోరికను మాత్రే వ్యక్తం చేశాడు. చివరకు రోహిత్ తన ఇంటి చిరునామాను పంపించారు. తర్వాతి రోజు మాత్రే అక్కడికి వెళ్లి రోహిత్‌ను కలిశాడు. ఇద్దరూ దాదాపు రెండు గంటలపాటు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రోహిత్ ఎలాంటి విసుగు లేకుండా సౌకర్యంగా మాట్లాడినట్లు మాత్రే తెలిపాడు. తన అభిమాన క్రికెటర్‌తో అంత సమయం గడపడం తనకు కల నిజమైనట్టుగా అనిపించిందని చెప్పాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
Meeting his heRO,
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2026
A dream come true! 💛
Watch #TheMakingof Ayush Mhatre
Link : https://t.co/54DC3TCNkh #WhistlePodu #Yellove pic.twitter.com/SYc0GmrGaT