ఐపీఎల్‌లో అందరి చూపులు మహేంద్ర సింగ్ ధోనిపైనే!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎల్లో ఆర్మికి నాలుగు టైటిళ్లను ధోని అందించాడు. ఈ సీజన్ ధోనికి చివరదని ప్రచారం జరుగుతుండటంతో అందరి కళ్లు అతనివైపే ఉన్నాయి. ధోని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2023 ఐపీఎల్‌లో పలు రికార్డులపై కన్నేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ధోనీ 39.19 సగటుతో 4,978 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 84 స్కోరు చేశాడు. ఇందులో 23 అర్ధసెంచరీలు చేశాడు. ధోని 5వేల పరుగులు చేయడానికి ఇంకా 22 పరుగులు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 196 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోని.. మరో నాలుగు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే ఒక 200 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన మొట్టమొదటి ఆటగాడిగా ధోని నిలవనున్నాడు.
ధోని సాధించిన రికార్డులివే
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 4,500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ధోని (4,556) మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో కోహ్లీ (4,881). మూడో స్థానంలో (3,674) రోహిత్ నిలిచాడు. ఇప్పటి వరకూ చైన్నై తరుపున ధోని 199 సిక్సర్లను బాదాడు. ఆర్సీబీకి క్రిస్ గేల్ 239, ఎబి డివిలియర్స్ ఆర్‌సిబికి 238, కీరన్ పొలార్డ్ మంబై తరుపున 223 సిక్సర్లను కొట్టారు ఆర్‌సీబీపై అత్యధికంగా ధోని 31 ఇన్నింగ్స్‌లో 838 పరుగులు చేశాడు. అతని తర్వాత డేవిడ్ వార్నర్ 820 పరుగులు చేశాడు. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చైన్మై సూపర్ కింగ్స్ తలపడనుంది