NZ vs SL: సెంచరీతో విజృభించిన డారిల్ మిచెల్
క్రైస్ట్ చర్చ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో డారిల్ మిచెల్ సెంచరీతో విజృంభించాడు. తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న శ్రీలంకను న్యూజిలాండ్ గట్టి ఎదుర్కొంటొంది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు అలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 193 బంతుల్లో 102 పరుగులతో చెలరేగాడు. లాథమ్ 67 పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ 373 పరుగులు చేసింది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కివిస్ 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన మిచెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టామ్ లాథమ్, మాట్ హెన్రీతో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న డారిన్ మిచెల్
శతకం సాధించిన డారిల్ మిచెల్ చివరికి లాహిరు కుమార్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. ప్రస్తుతం మిచెల్ 17 టెస్టుల్లో ఐదు సెంచరీలు, ఏడు అర్ధశతకాల సాయంతో 1,218 పరుగులు చేశాడు. టెస్టుల్లో 1,000 పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన న్యూజిలాండ్ ఐదో ప్లేయర్ మిచెల్ నిలిచాడు. నవంబర్ 2019లో మిచెల్ తన టెస్ట్ అరంగేట్రం చేసినప్పటికీ, గతేడాది జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఎవే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఎనిమిది టెస్టుల్లో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీల సాయంతో 815 పరుగులు చేశాడు. ముఖ్యంగా ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో శ్రీలంక నిలవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక విజయం సాధించాలి