'చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయి' : పాక్ మాజీ ఆటగాడు
ఆసియా కప్ వివాదం రావణకాష్టంలా రగలుతూనే ఉంది. భద్రతా కారణాల వల్ల తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదికలు అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఏసీసీ ఇటీవల బీసీసీఐ, పాకిస్తాన్ బోర్డు మధ్య రాజీ కుదర్చినా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే మరో పక్క పాకిస్తాన్ జట్టు తాము ఇండియాలో నిర్వహించే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాదంపై పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు జావెద్ మియాంబాద్ స్పందించాడు.
భద్రత గురించి బీసీసీఐ మార్చిపోవాలి
భారత్ కు రావడానికి పాకిస్తాన్ కు ఎటువంటి సమస్య లేదని, అయితే పాకిస్తాన్ కు భారత్ రావాల్సిన సమయం వచ్చిందని మియాంబాద్ పేర్కొన్నారు. భద్రత గురించి బీసీసీఐ మర్చిపోవాలని, చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయని, అయితే విధిరాతను ఎవరూ మార్చలేరని అతను స్పష్టం చేశారు. తాము చివరిసారిగా భారత్‌కు వెళ్లామని, ప్రస్తుతం భారత్ వంతు వచ్చిందని మియాంబాద్ పేర్కొన్నారు. అయితే 2012 నుంచి భారత్-పాక్ దైప్వాక్షిక సిరీస్ ను ఆడలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి