Page Loader
తక్కువ రోజుల్లో పూర్తియైన టెస్టు మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి
భారత్‌లో టెస్టు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయి

తక్కువ రోజుల్లో పూర్తియైన టెస్టు మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ మధ్య కాలంలో ఐదురోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లు.. మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లతో ఫలితం తేలుతున్నా.. క్రికెట్ అభిమానులకు మాత్రం మాజా రావడం లేదు. సెషన్‌ సెషన్‌కు ఆధిక్యం మారుతూ ఉంటుంది. నాలుగు రోజుల పాటు ఆటపై పట్టు సాధించి.. చివరి రోజు విజయం కోసం చేసే పోరాటం అయితే నెక్ట్స్‌ లెవల్‌. అలాంటి టెస్టు మ్యాచ్‌లు చూసి చాలా కాలమైంది. తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లు మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు అతి తక్కువ సమయంలో పూర్తియైన టెస్టు మ్యాచ్‌గా నిలిచింది.

టీమిండియా

అతి తక్కువ సమయంలోనే పూర్తియైన టెస్టు మ్యాచ్‌లు

2018 భారత్, ఆఫ్ఘనిస్తాన్ టెస్టు మ్యాచ్ 1,028 బంతులతో ముగిసింది, ఇది భారతదేశంలో మూడవ అతి చిన్న టెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. భారత ఓపెనర్లు మురళీవిజయ్ (105), శిఖర్‌ధావన్ (107) సెంచరీలు చేయడంతో ఆతిథ్య జట్టు 474 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇన్నింగ్స్‌లలో 109, 103 పరుగులకు అలౌటైంది. బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ 968 బంతుల్లోనే బంగ్లాదేశ్‌ను 106 పరుగులకే అవుట్ చేసి, టీమిండియా 347/9 డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (136) అద్భుత శతకం సాధించాడు. 1935లో ఇంగ్లండ్‌తో జరిగిన మోటెరా టెస్టులో భారత సంచలనం సృష్టించింది. భారత్ రెండు రోజుల్లో ఆటను ముగించింది, ఇది అత్యంత తక్కువ సమయంలోనే పూర్తియైన టెస్టు మ్యాచ్‌గా నిలిచింది.