SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్
దక్షిణాఫ్రికా పర్యటనకు ఇద్దరు సీనియర్ భారత పేసర్లు దూరమయ్యారు. మహ్మద్ షమీ టెస్టు సిరీస్‌కు దూరమవగా, దీపక్ చాహర్ వన్డేల నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ శనివారం వెల్లడించింది. చీలమండ గాయం నుంచి షమీ కోలుకుంటున్న నేపథ్యంలో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో షమీ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు దీపక్ చాహర్ కూడా తాను అందుబాటులో ఉండబోనని బీసీసీఐకి తెలిపాడు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తాను ఆడలేనని బోర్డుకు చెప్పాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను రాబోయే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. 2, 3వ మ్యాచ్‌లలో బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టుకు అందుబాటులో ఉండడని, అయితే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని పేర్కొది.