Babar Azam: ఆఫ్గాన్‌పై ఓటమి బాధిస్తోంది: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. సోమవారం చైన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో పాక్ ఓటమిపాలైంది.
పాక్ నిర్ధేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి ఆఫ్గాన్ టార్గెట్‌ను చేధించింది.
అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఈ మెగా టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. ఆఫ్గాన్ పై ఓటమి అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు.
తమ ఓటమికి బౌలర్లే కారణమని, ఈ ఓటమి తమను తీవ్రంగా బాధిస్తోందని బాబర్ పేర్కొన్నారు.
Details
తదుపరి మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం
ఈ ఓటమి తమ జట్టును తీవ్రంగా నిరాశపరిచిందని, బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయామని, ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయామని, ఫీల్డింగ్‌లో చాలా బౌండరీలు ఆపలేకపోయామని బాబార్ అజామ్ పేర్కొన్నారు.
ఆఫ్గానిస్తాన్ ఈ మ్యాచులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని, తదుపరి మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.
తాము పేసర్ నసీమ్‌ను చాలా మిస్ అవుతున్నామని చెప్పారు.