
WI vs PAK: విండీస్ చేతిలో 202 పరుగుల తేడాతో ఓటమి.. పాక్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ పర్యటనలో పాకిస్థాన్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. టీ20 సిరీస్‌ను గెలుచుకున్నప్పటికీ, వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ముఖ్యంగా 34 ఏళ్ల తర్వాత విండీస్ పాక్‌పై వన్డే సిరీస్‌లో విజయం సాధించడం ప్రత్యేకం. కీలకమైన మూడో వన్డేలో వెస్టిండీస్ పాక్‌ను 202 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ ఘోర ఓటమి తరువాత పాక్ స్టార్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Details
92 పరుగులకే పాక్ ఆలౌట్
షై హోప్ (120 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ కేవలం 92 పరుగులకే ఆలౌటైంది. జయ్‌దేవ్ సీల్స్ కేవలం 18 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు. సల్మాన్ అఘా (30), మహ్మద్ నవాజ్ (23), హసన్ నవాజ్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. వీరిలో కెప్టెన్ రిజ్వాన్ కూడా ఉండగా, బాబర్ అజామ్ కేవలం 9 పరుగులకే పరిమితమయ్యాడు. గత మ్యాచ్‌లో బాబర్ సున్నాకే పెవిలియన్‌కు చేరాడు.
Details
నెట్టింట పాక్ అభిమానులు కీలక వ్యాఖ్యలు
* 'సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు 92 పరుగులకే ఆలౌటైంది. పదో ర్యాంక్ జట్టైన విండీస్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. ఇలాగే ఆసియా కప్‌లో దిగితే పరిస్థితి దారుణమని విమర్శించారు. * ''బాబర్ అజామ్ ప్రదర్శన నిరాశ కలిగించింది. షై హోప్ అదరగొట్టిన అదే పిచ్‌పై పాక్ స్టార్‌లు తేలిపోయారన్నారు. * 'త్వరలో నేపాల్‌తో సిరీస్ ఏర్పాటు చేయండి. అప్పుడు బాబర్ అజామ్ బాగా ఆడతాడు. జట్టులో స్థానం నిలుపుకోవాలంటే అక్కడే భారీ పరుగులు చేస్తాడని మరోవ్యక్తి వ్యాఖ్యానించాడు.