
రోసోప్ వీరవిహారంతో 213 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్; పంజాబ్ లక్ష్యం 214 రన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) బ్యాటర్లు విజృంభించారు.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దిల్లీని బ్యాంటింగ్‌కు ఆహ్వానించాడు.
నిర్ణీత 20ఓవర్లలో దిల్లీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 213పరుగులు చేసింది. పంజాబ్‌కు 214పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దిల్లీ బ్యాటర్లు రోసోప్, పృథ్వీషా, వార్నర్, ఫిలిప్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా రోసోప్ 6సిక్స్‌లు, 6ఫోర్లతో కేవలం 37బంతుల్లోనే 82పరగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
దిల్లీ జట్టు ఇప్పటికే ప్లే-ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ కాగా, పంజాబ్‌కు ఈ మ్యాచ్‌కు కీలకం కానున్నది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ బ్యాటర్ల విజృంభణ
2️⃣1️⃣3️⃣ - Our highest score of #IPL2023 🤩
— Delhi Capitals (@DelhiCapitals) May 17, 2023
Let's make this happen 💪