LOADING...
DC vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం 
ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం

DC vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2025
11:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ విశాఖ పట్నం వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ధేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేధించింది. 113 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విప్ రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39), అశుతోష్ (31 బంతుల్లో 66*పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టును గెలిపిందించారు. అశుతోష్ చివరి వరకూ క్రీజులో ఉండి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. లక్నో బౌలర్లలో శార్దూల్, సిద్ధార్థ్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్సర్ కొట్టి మ్యాచును గెలిపించిన అశుతోష్