Page Loader
Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి సోఫీ డెవిన్‌
వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి సోఫీ డెవిన్‌

Sophie Devine: వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి సోఫీ డెవిన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది భారత్, శ్రీలంక కలిసి నిర్వహించబోతున్న వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆమె ఈ ఫార్మాట్ నుంచి విరమించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) అధికారికంగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. 35 సంవత్సరాల వయసున్నఈ అనుభవజ్ఞురాలైన ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 152 వన్డే మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది.

వివరాలు 

107 వికెట్లు తీసిన డెవిన్

ఆమె మొత్తం 3,990 పరుగులు సాధించింది. ఆమె ఖాతాలో ఇప్పటివరకు 8 శతకాలు,16 అర్ధ శతకాలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకున్న డెవిన్ ఇప్పటివరకు 107 వికెట్లు తీసింది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆమె నాలుగో స్థానంలో నిలవగా, బౌలింగ్ విభాగంలో రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీసీ చేసిన ట్వీట్