Page Loader
ధోనిపై విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టిన కోచ్ స్టీఫెన్
మహేంద్ర సింగ్ ధోని, కోచ్ స్టీవన్ ఫ్లెమింగ్

ధోనిపై విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టిన కోచ్ స్టీఫెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 01, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 16వ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో ధోని భారీ సిక్సర్ కొట్టి అభిమానులను అలరించాడు. 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. కీపింగ్‌లో మాత్రం ధోని కొంచెం వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధోనిలో వేగం లోపించిందని విమర్శలు వినపడ్డాయి. దీనిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిలో 15 ఏళ్ల క్రితం ఉన్న దూకుడు ఇప్పుడెలా ఉంటుందని ప్రశ్నించారు. ధోని నిరంతరం ఆడుతూనే ఉన్నాడని, అయితే అతడిలో వేగం తగ్గిందనే వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆర్ధం కావడం లేదని, ఈ సీజన్‌కి ముందే ధోని మోకాలి నొప్పితో బాధపడ్డానని తెలియజేశారు.

ధోని

మరో అరుదైన ఫీట్‌ను సాధించిన ధోని

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లోని దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్‌లో తెవాతియా ప్యాడ్లను తాకి లెగ్‌సైడ్‌కు వెళ్తున్న బంతిని ధోని ఆపడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలో అతడి కండరాలు పట్టేయడంతో కొద్దిసేపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగింది. అయితే త్వరగానే సర్దుకున్న ధోనీ కీపింగ్‌ బాధ్యతలను చేపట్టాడు. 20వ ఓవర్ మూడో బంతికి సిక్సర్ కొట్టిన ధోని ఓ ఆరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ ఒకే ఫ్రాంచైజీకి 200 సిక్సర్లు బాదిన ఐదో ఆటగాడిగా ధోనీ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో చైన్నై‌పై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.