
ఆసియా కప్ పేరు వినగానే ధోని ఒక్కడే గుర్తుకొస్తాడు మరి.. ఎందుకంటే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీమిండియాకు వన్డే, టీ20, ఛాంపియన్ ట్రోఫీలను అందించిన ఏకైక నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో చైన్నైకు ఐదు టైటిళ్లను అందించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆసియా కప్ లోనూ తనకంటూ చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
2004లో అంతర్జాతీయ కెరీర్‌లోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని, తొలిసారిగా 2007 టీ20 ప్రపంచ కప్ నుంచి కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. 2008లో జరిగిన ఆసియా కప్ లోనూ భారత్ కు కెప్టెన్ కు వ్యవహరించాడు.
ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టు, ఆ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.
Details
టీ20, వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఛాంపియన్ ట్రోఫీని సాధించిన ధోని
2008 ఆసియా కప్ తర్వాత మళ్లీ రెండేళ్లకు మినీ టోర్నీ వచ్చేసింది. ఈసారి కూడా ధోనినే కెప్టెన్‌గా వ్యవహరించాడు.
2010 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి తొలిసారి ధోని నాయకత్వంలో ఛాంపియన్‌గా అవతరించింది.
అయితే 2012 ఆసియా కప్‌లో భారత్ కు గట్టి షాక్ తగిలింది.
ఆ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్,ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కు చేరిన బంగ్లాదేశ్,పాకిస్థాన్ చేతిలో ఒటమిపాలైంది.
ఈ ఆసియా కప్ లో ధోని ప్రదర్శన అశాజనకంగా లేదని చెప్పొచ్చు. టీ20, వన్డే వరల్డ్ కప్‌లతోపాటు ఛాంపియన్స్ ట్రోపీని గెలిచిన ధోనీ.. వన్డే,టీ20 ఫార్మాట్లలో ఆసియా కప్‌లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు.