ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ జట్లలన్నీ ప్రాక్టీస్ ను మొదలు పెట్టాయి. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్-చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ అవుతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. గత రెండు, మూడు సీజన్ల నుంచి ధోనికే ఇదే చివరి సీజన్ కాబోతోందని అన్న వార్తలను తాను వింటున్నానని, ధోని మరిన్ని సీజన్లు ఆడేంత ఫిట్ గా ఉన్నాడని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు.
సీఎస్కేకి నాలుగు టైటిళ్లు అందించిన ధోని
యువ క్రికెటర్లు హవా ఎక్కువగా ఉండే టీ20 క్రికెట్లో 41 ఏళ్ల ధోని ఇంకెన్నాళ్లు కొనసాగుతాడన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఐపీఎల్‌లో ధోని 234 మ్యాచ్‌లు ఆడి 4978 రన్స్ చేశాడు. సీఎస్కే అతని కెప్టెన్సీలో నాలుగు టైటిల్స్‌ను గెలుచుకుంది. 2023 లో ఇండియాలోని ప్రతి స్టేడియంలో ఆడి ఐపీఎల్ కు గుడ్ బై చెప్ప అవకాశం వస్తే అంతకు మంచి కావాల్సింది ఏముంటుందని గతంలో మహేంద్ర సింగ్ ధోని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలు నిజం కావాలని ధోని ఫ్యాన్స్ అశిస్తున్నారు.