Page Loader
MS Dhoni: సాధారణ భక్తుడి లాగే... ఎంఎస్ ధోనీ! 
MS Dhoni: సాధారణ భక్తుడి లాగే... ఎంఎస్ ధోనీ!

MS Dhoni: సాధారణ భక్తుడి లాగే... ఎంఎస్ ధోనీ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2024
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంఎస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం తన సన్నాహాలను ప్రారంభించాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా చివరిసారిగా IPL 2023 ఫైనల్‌లో కనిపించాడు. తాజాగా ఆయన రాంచీలోని డియోరీ మా ఆలయాన్ని సందర్శించారు. సాధారణ భక్తుల లాగే క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని మహీ సందర్శించారు. ఈ సందర్భంగా దేవరీ మా ఆలయంలోని దుర్గాదేవికి ధోని ప్రత్యేక పూజలు చేశారు. ఎంఎస్ ధోనితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.ధోని దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2023 ఐపీఎల్ తరువాత గత ఏడాది జూన్‌లో ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న మహీ.. గత రెండు నెలలుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు.

Details 

 CSKలో న్యూజిలాండ్ ఆల్-రౌండర్

ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. చెన్నై జట్టుకు ధోనీ ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే. తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో, CSK డిసెంబరు 19న దుబాయ్‌లో జరిగిన వేలంలో అద్భుతంగా బిడ్డింగ్ చేసింది. MS ధోని నేతృత్వంలోని జట్టు మొత్తం ఆరు మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఆ బిడ్డింగ్ లో న్యూజిలాండ్ ఆల్-రౌండర్ డారిల్ మిచెల్‌ని ఏకంగా రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంతేకాకుండా సమీర్ రిజ్వీని రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుడి క్యూ లైన్ లో నిలుచున్న ఎంఎస్ ధోనీ వీడియో