Page Loader
MS Dhoni : కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?
కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?

MS Dhoni : కుర్రాడిలా మారిన ధోనీ.. మిస్టర కూల్ కొత్త లుక్ చూశారా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరు, సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ధోని ఎప్పటికప్పుడు కొత్ల లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జుట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా ధోని హెయిర్ కట్ చేయించి కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. తన హెయిర్‌ స్టయిల్‌ను పూర్తిగా మార్చి, స్టైలిష్‌, యంగ్‌ లుక్‌తో కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ధోనీ తాజా లుక్‌ ఫొటోలు ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

Details

హాలీవుడ్ హీరోలా ఉన్నావంటూ ప్రశంసలు

ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఫ్యాన్స్‌ హాలీవుడ్‌ హీరోలా ఉన్నావ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు మాత్రమే ఆడుతున్నాడు. మిగతా సమయం కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తున్నాడు.