Rohit Sharma: అభిమానుల హద్దులు దాటాయా? చెయ్యిపట్టుకుని లాగడంతో రోహిత్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోహిత్‌ను చూసిన ఇద్దరు చిన్నారులు సెల్ఫీ కోసం అతని వద్దకు వచ్చారు. ఈ క్రమంలో రోహిత్ కారు కిటికీ నుంచి చేయి బయట పెట్టి వారికి అభివాదం చేయగా, ఆ పిల్లలు అతని చేయిని పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. దీనితో అసంతృప్తికి గురైన రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Details
అత్యధిక సిక్సలు బాదిన క్రికెటర్ గా రికార్డు
రోహిత్ శర్మకు 2025 సంవత్సరం మరపురానిదిగా నిలిచింది. అతడి నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని ఘన విజయం సాధించింది. అదే ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. అలాగే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును కూడా నవంబర్‌లో అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 355 వన్డే సిక్సర్లు ఉన్నాయి. గతేడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 650 పరుగులు సాధించి, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Details
జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో వన్డే సిరీస్
వన్డేల్లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నప్పటికీ, రోహిత్ శర్మ గతేడాది మే నెలలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు స్వస్తి పలికి, ఇకపై కేవలం వన్డేలపైనే దృష్టి సారించనున్నట్లు అప్పట్లో వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్, సిక్కింకు వ్యతిరేకంగా 155 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటాడు. ఇదిలా ఉండగా, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Rohit Sharma is the greatest player of india and misbehaving with him like this is totally inappropriate👍
— Gillfied⁷ (@Gill_Iss) January 4, 2026
pic.twitter.com/HvA9o9993m