ఆసీస్ మాజీ సారిథి మార్క్ వా- దినేశ్ కార్తిక్ మధ్య మాటల యుద్ధం
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీసారిథి మార్క్ వా-దినేష్ కార్తీక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అంటూ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఫీల్డ్ గురించి మాట్లాడిన మార్క్ వా.. దినేష్ కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఫీల్డ్ చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, టీమిండియా బ్యాట్‌మెన్ పుజారా పరుగులు కోసం కష్టపడుతున్నాడని, అతడు ఆఫ్‌సైడ్ బాల్‌ను దూరంగా ప్యాడ్ చేశాడని ఆసీసీ మాజీ సారిథి మార్క్ వా చెప్పారు. దీనిపై దినేష్‌కార్తీక్ స్పందించాడు. మార్క్ వా ఫీల్డ్ గురించి ఆనందంగా లేరని తనకు అర్థమైందని, ఆయన దేని గురించి మాట్లాడారో ఆర్థం కాలేదన్నారు.
వెటకారంగా ఉందని చెప్పిన దినేష్ కార్తీక్
తనకు ఆఫ్ సైడ్ బ్యాట్ ప్యాడ్ కావాలని, అక్కడ్ కవర్ ఉంటుందని, అప్పుడు ఫీల్డ్ బాగుటుందని మార్క్ వా చెప్పారు. ఒకవేళ ఆ పాయింట్ ఉండుంటే ఆ బంతి బౌండరికీ వెళ్లేదని దినేష్ కార్తీక్ చెప్పాడు. తాము ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తామని, తాను రోహిత్ శర్మ గురించి మాట్లాడలేదని, అతడు పూర్తిగా భిన్నమైన ఆటగాడు అని మార్క్ వా పేర్కొన్నారు. ఇది కొంచెం వెటకారంగా ఉందని దినేష్ కార్తీక్ ఘాటుగా సామాధానమిచ్చాడు. ఈ మాటలు సీరియస్ కాకముందే తోటీ కామేంటర్ సంజయ్ ముంజ్రేకర్ జోక్యం చేసుకొని తాను స్కోరు చదువుతున్నానని మధ్యలో ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరు సర్దుమణిగారు.