Ravichandran Ashwin: అశ్విన్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్!
భారత క్రికెట్‌లో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. దశాబ్దానికి పైగా భారత జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగిన అశ్విన్, రిటైర్మెంట్ తర్వాత ప్రశంసలను అందుకున్నారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా అశ్విన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా హర్భజన్, అశ్విన్‌తో ఉన్న విభేదాల గురించి వస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. తమ వద్ద ఎలాంటి విభేదాలు లేవని, ఎవరెవరో తన వ్యాఖ్యలను వక్రీకరించి విభేదాలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఎలాంటి సమస్యలు లేవు : హర్బజన్
తాను అశ్విన్ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టంగా చెప్పగలని హర్భజన్ పేర్కొన్నాడు. ఇక అశ్విన్, రవీంద్ర జడేజా అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జోడీ ఎన్నో మ్యాచ్‌ల్లో భారత జట్టుకు విజయాలు అందించింది. అయితే అశ్విన్ రిటైర్మెంట్ గురించి జడేజాకు ఐదు నిమిషాల ముందే తెలిసింది. అశ్విన్ రిటైర్మెంట్ విషయం తనకు విలేకర్ల సమావేశానికి ఐదు నిమిషాల ముందు తెలిసింది. తాను అశ్విన్‌తో చాలా సమయం గడిపాననని జడేజా తెలిపాడు. అశ్విన్ తనకు ఆన్-ఫీల్డ్ మెంటార్ లాంటివాడని, వారి మధ్య జరిగిన చర్చలు, మ్యాచ్‌లపై ఉన్న అనుబంధం జడేజా చాలామందికి గుర్తొస్తుందని చెప్పారు.