
Dilshan Madhushanka: వరల్డ్ కప్‌లో రాణించిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకకు ఐపీఎల్‌లో భారీ ధర
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
అయితే ఆ జట్టు పేసర్ దిల్షాన్ మధుశంక(Dilshan Madhushanka) తన బౌలింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ 23 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ సీమర్ భారత్ గడ్డపై జరిగిన వరల్డ్ కప్‌లో 21 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఇవాళ జరిగిన ఐపీఎల్(IPL) మినీ వేలంలో దిల్షాన్ మధుశంకను రూ.4.6 కోట్లతో ముంబయి ఇండియన్స్(Mumbai Indians ) సొంతం చేసుకుంది.
అతడి బౌలింగ్ లో మంచి పేస్ ఉండటంతో అతన్ని కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపించాయి.
Details
మధుశంక కోసం పోటీపడ్డ ముంబాయి, లక్నో
శ్రీలంక తరఫున మధుశంక తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. 15 వన్డే మ్యాచుల్లో 24.06 సగటుతో 31 వికెట్లను తీశాడు.
ఈరోజు జరిగిన వేలంలో మధుశంక కోసం ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ హోరాహోరీ పోటీపడ్డాయి.
చివరికి అతడిని ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది.