
T20 World Cup: శుభ్‌మాన్ గిల్‌కు ఇక కష్టమే.. వరల్డ్ కప్‌లో ఆడాలంటే అతని కంటే బాగా ఆడాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లో ఓపెనర్‌గా శుభమన్ గిల్ (Shubman Gill) వ్యవహరిస్తున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా ఈ పంజాబీ బ్యాటర్ తన ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీ20లకు రోహిత్ దూరమయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానంలో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అవకాశాలను దక్కించుకున్నాడు.
అయితే గిల్ పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టీ20 జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు ఎంపికైన ఈ ముంబై బ్యాటర్ వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు.
Details
రుతురాజ్- శుబ్‌మన్ గిల్ మధ్య గట్టి పోటీ!
ఆసీస్ ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా 55.75 సగటుతో 223 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక సిరీస్‌ను 4-1తో టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఉద్ధేశించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) కీలక వ్యాఖ్యలు చేశాడు.
గిల్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య ఓపెనింగ్ స్థానం కోసం ఇకపై గట్టి పోటీ ఉంటుందని, వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఆడాల్సి ఉందన్నారు.
కావున రుతురాజ్- శుబ్‌మన్ గిల్ మధ్య షూటౌట్ తప్పదని, ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.