మలేషియా మాస్టర్స్ 2023 : నిరాశ పరిచిన శ్రీకాంత్.. సెమీఫైనల్ కు సింధు, ప్రణయ్
కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న మలేసియా మాస్టర్స్ టోర్నీలో పివి సింధు సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో 21-16, 13-21, 22-20తో చెనా షట్లర్ జాంగ్ యి మాన్‌ను చిత్తు చేసింది. తొలి గేమ్ ను ఈజీగా గెలిచిన సింధుకు రెండో గేమ్ లో కష్టపడాల్సి వచ్చింది. ప్రత్యర్థి పూర్తి ఆదిపత్యం ప్రదర్శించడంతో రెండో గేమ్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముడో గేమ్ లో ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడ్డారు. చివరికి సింధునే మూడో గేమ్ ను నెగ్గింది. అదే విధంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ లో సింధు 21-16, 21-11తో అయా ఒహొరి (జపాన్)పై విజయం సాధించిన తెలిసిందే.
ఇండోనేషియా ప్లేయర్ క్రిస్టియన్ చేతిలో శ్రీకాంత్
పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక్కడే సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఉత్కంఠంగా సాగిన సెమీఫైనల్లో ప్రణయ్ 25-23, 18-21, 21-13 తేడాతో జపాన్ ప్లేయర్ కెంటా నిషిమొటొను ఓడించారు. ఇక క్వార్టర్స్‌లో ప్రణయ్ 13-21, 21-16, 21-11తో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షై ఫెంగ్ (చైనా)పై గెలుపొందాడు. మరో ప్లేయర్ కిందాబి శ్రీకాంత్ క్వార్టర్స్ కే పరిమితమయ్యాడు. శ్రీకాంత్ 21-16, 16-21, 11-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ క్రిస్టియన్ ఎడినాట చేతిలో పరాజయం పాలయ్యాడు. మొదటి గేమ్ లో అధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్ వరుసగా రెండు గేమ్ ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.