Page Loader
మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిన జొకోవిచ్
అగ్రస్థానంలో నిలిచిన నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్

మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిన జొకోవిచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రపీఠాన్ని సొంతం చేసుకున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరజ్ ను వెనక్కి నెట్టి నంబర్ 1 ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు. రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకొని జొకోవిచ్ తిరిగి అగ్రస్థానానికి ఎగబాకడం విశేషం. అల్కారజ్‌, డేనియల్‌ మెద్వెదెవ్‌, కాస్పర్‌ రూడ్‌, స్టెఫనాస్‌ సిసిపాస్‌ వరుసగా తొలి అయిదు స్థానాల్లో నిలవడం గమనార్హం.

Details

మహిళల విభాగంలో టాప్ ర్యాంకు సొంతం చేసుకున్న ఇగా స్వియాటెక్

మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ టాప్ ర్యాంకును సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలవడంతో ఆమె నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అరినా సబలెంక, ఎలెనా రిబకినా, కరోలిన్‌ గార్సియా, జెస్సికా పెగ్యులా వరుసగా తరువాతి నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంకు సాధించడంపై అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.