Page Loader
DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్!
ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్!

DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
08:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఐపీఎల్‌ విజేతగా నిలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉందన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం అయిన డియాజియో కంపెనీ, ఆర్సీబీలో ఉన్న తమ సంపూర్ణ వాటా లేదా ఒక భాగాన్ని విక్రయించేందుకు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే వారు కొంతమంది పెట్టుబడిదారులతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అలాగే, ఆర్సీబీ విలువను సుమారు 2 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.17,032 కోట్లు)గా నిర్ణయించినట్టు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇంతలో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ వాటాలు కొనుగోలు చేయనున్నారని కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై డీకే శివకుమార్ స్పందించారు.

Details

తప్పుడు వార్తలను నమ్మొద్దు

ఇవన్నీ తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. "నేను చిన్ననాటి నుంచే కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడిని, అంతే. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామిగా చేరాలని కొన్ని ఆఫర్లొచ్చినా, నాకు సమయం లేదు. ఆర్సీబీ నాకు అవసరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఇక ఈ అమ్మక వార్తలు వెలుగులోకి రాగానే మంగళవారం ఉదయం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేర్లు 3.3 శాతం మేర పెరిగినాయి. గుర్తుచేసుకుంటే, 2008లో ఐపీఎల్‌ ప్రారంభ సమయంలో యూబీ గ్రూప్ అధినేత విజయ్‌ మాల్యా ఆర్సీబీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మాల్యా ఆర్థిక సంక్షోభానికి గురయ్యారు. భారత్‌లోని యునైటెడ్‌ స్పిరిట్స్‌ ద్వారా డియాజియో ఆర్సీబీని తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే, ఆర్సీబీ అమ్మకానికి సంబంధించి వస్తున్న వార్తలను డియాజియో పూర్తిగా ఖండించింది.