NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం
    తదుపరి వార్తా కథనం
    టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం
    టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం(ఫొటొ @BCCI ట్విట్టర్ సౌజన్యంతో)

    టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం

    వ్రాసిన వారు Stalin
    Jun 30, 2024
    08:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    T20 world cup prize money: టీ20 ప్రపంచకప్- 2024 ఛాంపియన్ టీమ్ ఇండియాకు బంపర్ ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుపై కూడా కాసుల వర్షం కురిసింది.

    ఈ మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ఇప్పటికే ప్రైజ్ మనీ ప్రకటించింది. T20 ప్రపంచ కప్ 2024 కోసం మొత్తం 11.25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 93.51 కోట్లు) ప్రైజ్ మనీగా వెల్లడించింది.

    ఈ ప్రైజ్ మనీలో భారత జట్టు సుమారు రూ. 20.36 కోట్లను అందుకుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి విజేత జట్టుకు ఇంత మొత్తం లభించింది.

    రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు సుమారు రూ. 10.64 కోట్లు (1.28 మిలియన్లు డాలర్లు) అందాయి.

    టీ20

    సెమీ ఫైనలిస్టులకు ఎంతంటే? 

    సెమీ-ఫైనల్‌కు చేరుకున్న ఇతర రెండు జట్లు అయిన ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌లకు దాదాపు రూ. 6.54 కోట్లు(787,500 డాలర్ల) అందించారు.

    ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టుకు ఐసీసీ కొంత మొత్తాన్ని ఇచ్చింది.

    సూపర్-8(రెండో రౌండ్) దాటి ముందుకు సాగని జట్లకు ఒక్కొక్కటి 382,500 డాలర్లు (సుమారు రూ. 3.17 కోట్లు) ఐసీసీ అందజేసింది.

    తొమ్మిది నుంచి 12వ స్థానంలో నిలిచిన జట్లకు ఒక్కొక్కటి 247,500 డాలర్లు (దాదాపు రూ. 2.05 కోట్లు)లభించాయి. 13నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లు ఒక్కొక్కటి 225,000 డాలర్లు (సుమారు రూ.1.87 కోట్లు) అందుకున్నాయి.

    ఇది కాకుండా, మ్యాచ్‌లో (సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ మినహా) గెలిస్తే జట్లకు అదనంగా 31,154డాలర్లు (సుమారు రూ. 25.89లక్షలు) లభించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీ20 ప్రపంచకప్‌
    టీమిండియా
    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టీ20 ప్రపంచకప్‌

    IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా?  సంజు శాంసన్
    T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..?  క్రీడలు
    Unmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్  క్రీడలు
    Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్  విరాట్ కోహ్లీ

    టీమిండియా

    SA vs IND : రేపే సఫారీలతో రెండో టెస్టు.. అశ్విన్, జడేజాను ఆడించాలి : భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
    IND vs SA : కేప్‌టౌన్ టెస్టులో బద్దలైన రికార్డులివే.. ధోని సరసన రోహిత్ శర్మ నిలుస్తాడా? సౌత్ ఆఫ్రికా
    IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా సౌత్ ఆఫ్రికా
    Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు రోహిత్ రెడ్డి

    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! ఆస్ట్రేలియా
    విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు క్రికెట్
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025