
CSK: చైన్నైకి ఫ్లే ఆఫ్స్ ఛాన్సుందా?.. ఇలా జరిగితే సాధ్యమే!
ఈ వార్తాకథనం ఏంటి
వాంఖడే స్టేడియంలో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తక్కువ పర్సెంటేజ్ ఆశలతో మైదానంలోకి దిగింది.
అయితే ముంబయి ఇండియన్స్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్ రేసులో నుంచి దాదాపుగా వెనుదిరిగినట్లయింది.
ఈ ఓటమితో ధోని సేనకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో చెన్నైకి ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం.
ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు పాయింట్లే ఖాతాలో వేసిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో చివర స్థానంలో నిలిచింది. ఈ స్థితిలో నుంచి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం గట్టి సవాలే.
Details
ప్లేఆఫ్స్‌కు మార్గం ఉందా?
గత సీజన్‌ను విశ్లేషిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇది లీగ్ 10 జట్లకు విస్తరించిన తరువాత 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టు.
ఇలాంటి స్థితిలోనూ బలమైన నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్ మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలిస్తే 16 పాయింట్లను ఖాతాలో వేసే అవకాశం ఉంటుంది.
అదే జరిగితే ధోనిసేన ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలదు. కానీ ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే, మిగిలిన అన్ని మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచి తమ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
ధోని నేతృత్వంలోని జట్టుకు ఈ దశలో ప్రతి మ్యాచ్ ఫైనల్ మ్యాచ్‌లానే మారనుంది. ఓటమికి ఇక చోటుండదు.