LOADING...
Ruturaj Gaikwad: సీఎస్కేకు కొత్త కెప్టెన్ అవసరమా?.. రుతురాజ్ కెప్టెన్సీపై విమర్శలు!
సీఎస్కేకు కొత్త కెప్టెన్ అవసరమా?.. రుతురాజ్ కెప్టెన్సీపై విమర్శలు!

Ruturaj Gaikwad: సీఎస్కేకు కొత్త కెప్టెన్ అవసరమా?.. రుతురాజ్ కెప్టెన్సీపై విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. వరుసగా నిరాశాజనక ఫలితాలు రావడంతో జట్టులో నాయకత్వ మార్పుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. వచ్చే సీజన్‌కు బలమైన జట్టును సిద్ధం చేయాలనే లక్ష్యంతో సీఎస్కే మేనేజ్‌మెంట్ పునర్నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంలోనూ ఆశించిన ప్రభావం చూపలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేకు తదుపరి కెప్టెన్‌గా సంజు శాంసన్ సరైన ఎంపిక అవుతాడని ఆయన అభిప్రాయపడ్డాడు.

వివరాలు

ఈ సీజన్లో రుతురాజ్ విఫలం

నిన్న సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్ తివారీ, రుతురాజ్ ప్రదర్శనపై స్పష్టమైన విమర్శలు చేశాడు. ఒక కెప్టెన్ విజయవంతంగా రాణించాలంటే ముందుగా బ్యాటర్‌గా పరుగులు చేయాలి. కానీ ఈ సీజన్‌లో రుతురాజ్ ఫామ్ ఏమాత్రం బాగాలేదు. గతంలో కనిపించిన ధాటితనం ఇప్పుడు కనిపించడం లేదు. అదే అతని కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపుతోందని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ 13 మ్యాచ్‌లు ఆడి 29.18 సగటుతో, 120.68 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 321 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఖాతాలో రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి.

వివరాలు

అంచనాలను అందుకోవడంలో విఫలం

అలాగే ఎంఎస్.ధోని వారసుడిగా రుతురాజ్‌పై భారీ అంచనాలేర్పడ్డాయని, అయితే వాటిని అందుకోవడంలో అతను విఫలమయ్యాడని తివారీ అభిప్రాయపడ్డాడు. ధోనీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రుతురాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంపై దృష్టి పెట్టాలి. కెప్టెన్‌గా చేసిన తప్పులను విశ్లేషించుకుని వచ్చే సీజన్‌కు మరింత బలంగా సిద్ధం కావాలని సూచించాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌కు విజయవంతంగా నాయకత్వం వహించిన అనుభవం ఉన్న సంజూ శాంసన్ సీఎస్కేకు సరైన నాయకుడవుతాడని తివారీ చెప్పాడు. రుతురాజ్‌కు వరుసగా రెండు సీజన్ల పాటు అవకాశం ఇచ్చారు.

Advertisement

వివరాలు

కెప్టెన్సీ రేసులో సంజు శాంసన్

అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. నా అంచనా ప్రకారం వచ్చే ఏడాది సీఎస్కే కెప్టెన్సీ రేసులో సంజు శాంసన్ పేరు బలంగా వినిపించొచ్చు. నాయకుడిగా, బ్యాటర్‌గా అతనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. సీఎస్కే అతడిని సారథిగా నియమిస్తే అది జట్టుకు మంచి నిర్ణయం అవుతుందని వ్యాఖ్యానించాడు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది.

Advertisement