LOADING...
Nagpuri Ramesh : డోపింగ్ కలకలం.. కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు
డోపింగ్ కలకలం.. కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు

Nagpuri Ramesh : డోపింగ్ కలకలం.. కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన శిష్యులైన ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కోసం సాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కోచ్‌గా ఉండి ఈ ఘటనలో బాధ్యత వహించాల్సిందిగా నాడా అభిప్రాయపడింది. దీంతో రమేష్‌తో పాటు ఆయనతో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లను కూడా నాడా సస్పెండ్ చేసింది. గతంలో ద్రోణాచార్య అవార్డుతో గౌరవింపబడ్డ నాగపురి రమేష్, దుతి చంద్, పారా ఒలింపియన్ జీవంజి దీప్తి, నందిని లాంటి పలువురు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశారు. ఆయన కోచింగ్‌లో భారత అథ్లెటిక్స్‌కు ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదిగారు.

Details

నేను ఏ తప్పు చేయలేదు

ఈ ఆరోపణలపై నాగపురి రమేష్ స్పందిస్తూ, "నేను ఎప్పుడూ తప్పు పనులకు ప్రోత్సాహం ఇవ్వలేదు. న్యాయంగా, క్రీడా ధర్మం మేరకే నా పని చేశాను. తెలుగు రాష్ట్రాల్లోని పేద, ప్రతిభావంతులైన అథ్లెట్లకు జీవితాన్నే అంకితమిచ్చా. విచారణ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ పరిణామం అథ్లెటిక్స్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నాడా తదుపరి చర్యల పట్ల స్పష్టత రానప్పటికీ, రమేష్‌కు మద్దతుగా పలువురు మాజీ శిష్యులు నిలిచే అవకాశం ఉంది.