
Vaibhav Suryavanshi: డబుల్ సెంచరీ టార్గెట్.. గిల్ నా ఇన్స్పిరేషన్.. వైభవ్ సూర్యవంశీ!
ఈ వార్తాకథనం ఏంటి
14 ఏళ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ఔట్స్టాండింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను ఇంగ్లండ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్.. ఇంగ్లండ్‌పై సంచలనాత్మక శతకంతో మెరిశాడు. కేవలం 78 బంతుల్లోనే 143 పరుగులు బాదిన ఈ యువకుడు.. త్వరలోనే డబుల్ సెంచరీ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు స్ఫూర్తి అని కూడా తెలిపాడు. నాకు రికార్డు సెంచరీ కొట్టానన్న విషయం ఆ వెంటనే తెలియలేదు. మా టీమ్ మేనేజర్ అంకిత్ సర్ వచ్చి ఈ విషయం చెప్పారు. 'యూత్ వన్డేల్లో రికార్డు సృష్టించావు.. అభినందనలన్నారు.
Details
ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు
అప్పుడే నిజంగా ఓ ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడానని తెలిసింది. కానీ ఆ శతకాన్ని డబుల్ సెంచరీగా మార్చుంటే ఇంకా గొప్పగా ఉండేది. గిల్‌ను చూస్తే ప్రేరణ వస్తుంది. అతను శతకం సాధించిన తర్వాత కూడా ఆటను ఆపకుండా కొనసాగిస్తాడు. జట్టును ముందుకు నడిపేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు. నన్ను కూడా అదే తత్వం ఆకట్టుకుందని వైభవ్ చెప్పాడు. తాను సెంచరీ చేసినప్పుడు ఇంకా 20 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఆ సమయాన్ని బాగా వినియోగించి ద్విశతకాన్ని సాధించాల్సింది. కానీ పూర్తిగా కాన్ఫిడెంట్‌గా కాకుండా కొట్టిన ఒక షాట్ వల్ల ఔట్ అయ్యాను.
Details
నా లక్ష్యం 200 పరుగులు
లేకపోతే డబుల్ సెంచరీ కూడా సాధించేవాడిని. రికార్డు అనంతరం ఎంతో మంది అభినందించారు.. కానీ ఎలాంటి సంబరాలు జరపలేదు. జట్టు విజయం కోసం ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీతో మాట్లాడా. ఇప్పుడు నా లక్ష్యం తదుపరి మ్యాచ్‌లో 200 పరుగులు చేయడం. చివరి ఓవర్ల వరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు మరిన్ని పరుగులు అందించేందుకు శ్రమిస్తానని వైభవ్ తెలిపారు.