LOADING...
Rohit Sharma: దుబాయ్‌ మా సొంత మైదానం కాదు.. కానీ సిద్ధంగా ఉన్నాం!
దుబాయ్‌ మా సొంత మైదానం కాదు.. కానీ సిద్ధంగా ఉన్నాం!

Rohit Sharma: దుబాయ్‌ మా సొంత మైదానం కాదు.. కానీ సిద్ధంగా ఉన్నాం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుబాయ్ మైదానం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దుబాయ్‌ మైదానం సొంతగడ్డ కాదని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని చెప్పారు. దుబాయ్‌ పిచ్‌ ప్రతి సారి భిన్న సవాళ్లను ముందుకు తీసుకెళ్తుందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి భిన్నంగా స్పందించిందని పేర్కొన్నారు. మైదానంలో మొత్తం నాలుగు పిచ్‌లు ఉండగా, సెమీ ఫైనల్‌ ఏ పిచ్‌పై జరుగుతుందో తెలియదని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నారు. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ ఒకే మైదానంలో ఆడుతుండడం వల్ల పెద్ద లాభం కలుగుతుందని కొందరు మాజీలు, క్రికెటర్లు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో సెమీస్‌ పోరుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ ఈ విషయాలను వివరించారు.

Details

టీమిండియా స్పిన్నర్లు ఎదుర్కోవడం కష్టం

న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడని, సెమీస్‌లోనూ నలుగురు స్పిన్నర్లతో ఆడాలని ఆసక్తిగా ఉందని, అన్ని అంశాలను పరిశీలించి సరైన కూర్పుతో బరిలోకి దిగుతామన్నారు. భారత స్పిన్నర్లంతా అత్యున్నత స్థాయి స్పిన్నర్లేనని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. సెమీస్‌లో కీలకం భారత్ స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటామన్నదేనని, స్పిన్‌ను ఆడడం తమకు సవాలే అని వ్యాఖ్యానించాడు.