Page Loader
Pole Vault: 23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్
23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్

Pole Vault: 23 ఏళ్లకే ఏడు ప్రపంచ రికార్డులను సృష్టించిన డుప్లాంటిస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోల్‌వాల్ట్‌లో సెర్గీ బుబ్కా ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించాడు. ఎన్నో చెక్కు చెదరని రికార్డులను బద్దలు కొట్టి సెర్గీ బుబ్కా రిటైర్ అయిపోయాడు. అతడి తర్వాతి ఆటలో అంతటి సత్తా ఉన్న మరో ఆటగాడు కనిపించలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత బుబ్కా బాటలోనే ఆర్మాండ్ డుప్లాంటిస్ అనే అటగాడు రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నాడు. తాజాగా పెర్ఫాన్ టైన్ క్లాసిక్ టోర్నీలో సత్తా చాటి మరోసారి డుప్లాంటిస్ వార్తల్లోకెక్కాడు. అతడి వయస్సు 23 ఏళ్లే అయినా ఇప్పటికే ఏడు ప్రపంచ రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

Details

డుప్లాంటిస్ సాధించిన రికార్డులివే

డుప్లాంటిస్‌ నాన్న గ్రెగ్ కూడా పోల్ వాల్ట్ ప్లేయర్ కావడంతో మూడేళ్ల వయస్సు నుంచి డుప్లాంటిస్ ఈ ఆటపై మనసు పడ్డాడు. నాన్నే అతడికి కోచ్ కావడంతో త్వరగా ఆ ఆటో రాటు దేలాడు. స్వీడన్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్‌లో చేరి పోల్ వాల్ట్‌లో నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. జూనియర్ స్థాయిలో 2015 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2017లో ఐరోపా ఛాంపియన్ షిప్, 2018లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి ఆకట్టుకున్నాడు. 2020 ఫిబ్రవరిలో పోలండ్‌లో జరిగిన ఈవెంట్లో 6.17 మీటర్ల ఎత్తు ఎగిరి ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

Details

పారిస్ ఒలింపిక్స్ లో జరిగే పసిడి పతకంపై కన్నేసిన డుప్లాంటిస్

2022లోనే డుప్లాంటిస్ 22 సార్లు 6 మీటర్లు అందుకోవడం విశేషం. తాను ఇన్ని రికార్డులు సాధించానని ఎప్పుడు గర్వపడలేదని, పోటీకి దిగిన ప్రతిసారి తానెంటో నిరూపించుకుంటానని డుప్లాంటిస్ చెప్పాడు. గత ప్రదర్శన మించి రాణించాలని ప్రయత్నిస్తానని, అందుకే ఎవరికి సాధ్యం కాని రికార్డులను సొంత చేసుకుంటున్నానని వెల్లడించారు. ఇక వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ లో జరిగే పసిడి పతకంపై డుప్లాంటిస్ కన్నేశాడు.