Page Loader
R Ashwin: 'అతన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి'.. భారత మాజీ క్రికెటర్ 
'అతన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి'.. భారత మాజీ క్రికెటర్

R Ashwin: 'అతన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి'.. భారత మాజీ క్రికెటర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 20, 2024
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవిచంద్రన్ అశ్విన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సమయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు, అని అతడి మాజీ సహచరుడు, సీఎస్కే మాజీ బ్యాటర్‌ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌ పేర్కొన్నారు. అశ్విన్ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై బద్రీనాథ్‌ ఆశ్చర్యపోయారు. అతడు జట్టు మేనేజ్‌మెంట్‌ నుండి సరైన వీడ్కోలు పొందలేదని అభిప్రాయపడ్డారు. బద్రీనాథ్‌ మాట్లాడుతూ, ''నేను అతడి నిర్ణయానికి షాక్‌ అయ్యాను. నిజాయతీగా చెప్పాలంటే, అశ్విన్ ను సరిగ్గా ట్రీట్‌ చేయలేదనే చెప్పాలి. పెర్త్‌ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్‌ తీసుకోవాలని కోరుకున్నట్లు రోహిత్‌ శర్మ వెల్లడించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులో ఆడుతున్నాడని తెలిసి అతడు ఆటను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు సంతోషంగా లేడనే విషయం ఆ నిర్ణయాన్ని స్పష్టం చేస్తోంది'' అన్నారు.

వివరాలు 

 500 వికెట్లు సాధించి లెజెండ్‌గా నిలిచాడు: బద్రీనాథ్‌ 

'' నిజంగా చెప్పాలంటే, ఒక తమిళనాడు క్రికెటర్‌ ఈ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయం. ఈ దిశగా చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల క్రీడాకారులు మంచి అవకాశాలు పొందుతుంటారు. అశ్విన్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ 500 వికెట్లు సాధించి లెజెండ్‌గా నిలిచాడు. అతడు అనుభవించిన కష్టాలు, అతన్ని పక్కకు తప్పించేందుకు చాలా సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ, అతడు ప్రతిసారి ఫినిక్స్‌ పక్షిలా తిరిగి గాల్లోకి ఎగిరాడు'' అని అన్నారు. అతడి రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్న వెంటనే, జట్టుతో సమయం గడపకుండా బ్రిస్బేన్‌ నుండి భారత్‌కు తిరిగి వచ్చాడని కూడా బద్రీనాథ్‌ పేర్కొన్నారు.

వివరాలు 

అతడు బీసీసీఐ లేదా ఐసీసీ పదవులు చేపట్టగలడు: పాక్‌ మాజీ క్రికెటర్‌ 

అదే సమయంలో, పాక్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ అశ్విన్‌ భవిష్యత్తులో బీసీసీఐ లేదా ఐసీసీలో కీలక పదవులు చేపట్టేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. ''భారత్‌లో అనేక క్రికెటర్లు ఉన్నప్పటికీ, అశ్విన్‌ స్థాయి ప్రత్యేకమైనది. అతడిలో ప్రత్యేకమైన క్వాలిటీలున్నాయి. భవిష్యత్తులో అతడు బీసీసీఐ లేదా ఐసీసీలో కీలక పదవిని చేపట్టేందుకు నమ్మకం ఉందని నాకు అనిపిస్తుంది. అతడి వినయం చూస్తే పెద్ద క్రికెటర్‌ అంటే నమ్మలేం. నేను పాకిస్థాన్‌ నుంచి అతడికి బెస్ట్‌ విషెస్‌ అందిస్తున్నాను'' అని రషీద్‌ లతీఫ్‌ అన్నారు.