మళ్లీ చెలరేగిన ఎల్లీస్ పెర్రీ.. ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తోంది. ఆమె నిలకడగా రాణిస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డబ్లిన్‌లోని క్లాన్‌టార్ప్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డేల్లో ఆస్ట్రేలియా మహిళా జట్లు విజయం సాధించింది. ఈ మ్యాచులో ఎల్లీస్ 99 బంతుల్లో (9 ఫోర్లు, 3 సిక్సర్లు) 91 పరుగులతో చెలరేగింది. దీంతో పెర్రీకి ఇది వన్డేల్లో 32వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేశారు. లక్ష్య చేధనకు దిగిన ఐర్లాండ్ 168 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
తొలి మహిళా ప్లేయర్ గా ఎల్లీస్ పెర్రీ రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో 6,000 పరుగులు, 300పైగా వికెట్లు తీసిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ 288 అంతర్జాతీయ మ్యాచుల్లో 6615 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగంలో 323 వికెట్లను పడగొట్టింది. ఆస్ట్రేలియా మహిళల తరఫున అత్యధిక పరుగులు సాధించిన 4వ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. క్లార్క్ (4,844), కరెన్ రోల్టన్ (4,814), మెగ్ లానింగ్ 4,602 పరుగులతో ఆమె కంటే ముందు స్థానంలో ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్ ను 168 పరుగులకు ఆలౌట్ చేయడంతో జార్జినా డెంప్సే నాలుగు వికెట్లతో రాణించింది.