Page Loader
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి
ఇంగ్లండ్ క్రికెటర్ మెయిన్ అలీ

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు గుడ్ బై చెప్పిన అలీ.. మళ్లీ జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తో యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన జట్టులో అతను స్థానం సంపాదించుకున్నాడు. జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మెయిన్ ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరడంతో అతను అంగీకరించాడు. జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.

Details

యాషెస్ సిరీస్ వేదికలు ఇవే

తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ జట్టు.. హ్యారీ బ్రూక్‌, బెన్‌ డకెట్‌, జో రూట్‌, జాక్‌ క్రాలే, డేనియల్‌ లారెన్స్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌ స్టో, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, మాథ్యూ పాట్స్‌, జోష్‌ టంగ్‌, మార్క్‌ వుడ్‌, ఓలీ రాబిన్సన్‌, మొయిన్‌ అలీ ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌ వేదికగా జరిగే యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌.. తొలి టెస్ట్‌, జూన్‌ 16-20, ఎడ్జ్‌బాస్టన్‌ రెండో టెస్ట్‌, జూన్‌ 28-జులై 2, లార్డ్స్‌ మూడో టెస్ట్‌, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్‌, జులై 19-23, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ ఐదో టెస్ట్‌, జులై 27-31, ఓవల్‌