
యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 16 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు సిద్ధమవుతోంది.
ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
కాలి ఫ్రాక్చర్ కారణంగా యాషెస్ సిరీస్ అందుబాటులో లేడని ఇంగ్లండ్ బోర్డు ధ్రువీకరించింది. లీచ్ ఐర్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచులో 4 వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే.
అతని స్థానంలో ఇంగ్లండ్ ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. 2018 లో ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేసిన లీచ్ 35 మ్యాచుల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.
Details
యాషెస్ సిరీస్ జూన్ 16న ప్రారంభం
యాషెస్ టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచుల కోసం ఇంగ్లండ్ 16 మంది కూడిన సభ్యులను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలై, జులై 31తో ముగియనుంది.
బిర్మింగ్హమ్ వేదికగా తొలి టెస్ట్ (జూన్ 16-20),
లార్డ్స్‌లో రెండో టెస్ట్ (జూన్ 28-జులై 2),
లీడ్స్‌లో మూడో టెస్ట్ (జులై 6-10),
మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ (జులై 19-23),
ఓవల్ వేదికగా ఐదో టెస్ట్ (జులై 27-31) జరుగుతుంది.