Page Loader
ENG Vs NED: నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం

ENG Vs NED: నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
09:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇవాళ నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ పై ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. బెన్ స్ట్రోక్స్ 108 శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరును చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (87), వోక్స్ (51) పరుగులతో ఫర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే 3, ఆర్యన్ దత్, వాన్ బీక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Details

మూడు వికెట్లతో చెలరేగిన మెయిన్ అలీ

లక్ష్య చేధనకు నెదర్లాండ్స్ కు జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వెస్లీ బరేసి (37), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (38), తేజ నిడమూరు 41* రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియానికి క్యూ కట్టడంతో నెదర్లాండ్స్ జట్టుకు ఓటమి తప్పలేదు. 37.2 ఓవర్లలో 179 పరుగులకు చేసి నెదర్లాండ్స్ ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మెయిన్ అలీ 3, అదిల్ రషీద్ 3, డేవిడ్ విల్లి 2 వికెట్లు పడగొట్టారు.