Ben Stokes: 3 నెలల పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. అతని తొడ కండరాలలో చీలిక ఏర్పడింది. దీనితో అతను మూడు నెలలపాటు క్రికెట్‌కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ కండరాల గాయానికి సంబంధించి, వచ్చే నెలలో స్టోక్స్‌కు శస్త్రచికిత్స చేయనున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టెస్టు మ్యాచ్‌లో స్టోక్స్ గాయపడ్డాడు. వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో స్టోక్స్‌కి చోటు దక్కలేదు. కండరాల సమస్యతో గతంలో కూడా స్టోక్స్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన హోం సిరీస్, పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టెస్టుకు అతను గాయం కారణంగా పాల్గొనలేదు.