Page Loader
టెస్ట్ క్రికెట్కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ గుడ్ బై.. ఘనంగా సాగనంపిన ఇంగ్లీష్ టీమ్
టెస్ట్ క్రికెట్కు గుడ్ బై​ చెప్పిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ

టెస్ట్ క్రికెట్కు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్​ అలీ గుడ్ బై.. ఘనంగా సాగనంపిన ఇంగ్లీష్ టీమ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ ఆల్ రౌండర్​​ మొయిన్​ అలీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు యాషెస్​ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్​ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు. సోమవారం జరిగిన మ్యాచ్​ అనంతరం తన టెస్ట్ కెరీర్​కు గుడ్ బై చెప్పారు.​ లండన్‌ వేదికగా జరిగిన యాషెష్ 5వ మ్యాచ్ అతని కెరియర్లో చివరిదిగా స్పష్టం చేశారు. 2021లోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాక ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు సహా టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్‌ కలిసి అలీని బుజ్జగించారు. దాంతో తన నిర్ణయాన్ని వాయిదా వేశాడు. అయితే ఈసారి స్వదేశంలో జరిగిన చివరి మ్యాచ్ సందర్భంగా తాను విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు.

DETAILS

రిటైర్మెంట్ తీసుకున్నాక మళ్లీ మెసేజ్ చేస్తే డిలీట్ చేసేస్తా : అలీ

మ్యాచ్ తర్వాత మైదానంలో రిటైర్మెంట్‌ గురించి స్పందించాడు. కెప్టెన్ స్టోక్స్‌ తనను క్రికెట్ ఆడాలని మళ్లీ మెసేజ్ చేస్తే, తాను దాన్ని వెంటనే డిలీట్‌ చేస్తానని అలీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాను వచ్చిన పని పూర్తి అయ్యిందన్నారు. అయితే యాషెష్ సిరీస్‌ను తాను బాగా ఎంజాయ్‌ చేసినట్లు చెప్పారు. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తొలుత స్టోక్స్​ తనను రీఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు తాను నో చెప్పానన్నారు. అయితే స్టోక్స్ మాత్రం నువ్వు ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించగలవనే నమ్ముతున్నట్లు చెప్పారని వివరించారు. ఈ క్రమంలోనే మళ్లీ రెడ్‌ బాల్‌ క్రికెట్కు ఓకే చెప్పినట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్​ కోసం జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నారు.