Page Loader
ENGLAND : 100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 
100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో

ENGLAND : 100వ ODIలో అర్థసెంచరీ బాదిన ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 10, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ తరఫున 100 వన్డేలు పూర్తి చేసుకున్న 27వ క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో మంగళవారం జరుగుతున్న ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ మైలురాయిని సాధించాడు. ఈ క్రమంలోనే బెయిర్‌ స్టో 59 బంతుల్లో 52 (8 ఫోర్లు)తో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా వన్డే ఫార్మాట్‌లో అతనికిది 16వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. 2011లో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో తొలుత మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, తర్వాత 2017లో ఓపెనర్‌గా మారాడు.ఇంగ్లండ్‌ 2019 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 45.03 సగటుతో 3,738 ODI పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 103.57తో 11 సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు బాదాడు.ఇక ఓపెనర్‌గా 74 వన్డేల్లో 3,091 పరుగులు చేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాపై అర్థసెంచరీ బాదిన ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్