
World Cup: వీర బాదుడుతో శతక్కొట్టిన డేవిడ్ మలాన్.. రికార్డు సెంచరీల మోత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మేరకు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో వేగంగా ఆరు సెంచరీలు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. మంగళవారం ధర్మశాలలో బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో 91 బంతుల్లో సెంచరీ బాదాడు.
మలాన్, 23వ ఇన్నింగ్స్ లోనే 6వ సెంచరీ సాధించడం కొసమెరుపు. దీంతో ఇమామ్-ఉల్-హక్ రికార్దును మలాన్ అధిగమించాడు.
27వ ఇన్నింగ్స్ లో అతడు ఆరో సెంచరీ కొట్టగా, ఉపుల్ తరంగ(29), బాబర్ ఆజం(32), హాషిమ్ ఆమ్లా(34) ఉన్నారు.
మరోవైపు క్యాలెండర్ ఇయర్ లో 4 సెంచరీలు చేసిన ఇంగ్లీష్ బ్యాటర్ల సరసన డేవిడ్ మలాన్ చేరాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
6 సెంచరీలతో రికార్డులు కొట్టిన డేవిడ్ మలాన్
Clubbed for a maximum 💥
— ICC (@ICC) October 10, 2023
This Dawid Malan six is one of the moments that could be featured in your @0xFanCraze Crictos Collectible packs!
Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #CWC23 pic.twitter.com/keyg2QSHIs