ప్రపంచ కప్ 2023 : నేడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు కీలకమైన పోరులో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. మ్యాచ్ ఫలితాన్ని ఇరు జట్లలో కొందరు ఆటగాళ్ల నిర్దేశించనున్నారు. వారి మధ్య పోరు కీలకం కానుంది. బాబర్ ఆజం vs మహేశ్ తీక్షణ పాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోతే బాబర్ ఆజం కీలకం అవుతాడు.అలాగే పాక్ బ్యాటర్లను ఎదుర్కోనేందుకు శ్రీలంకకు మహేష్ తీక్షణ కీలకం కానున్నాడు. తీక్షణ ODIల్లో 17.45 సగటుతో 33 వికెట్లతో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.బాబర్ 75 ఇన్నింగ్స్‌లలో 24 సార్లు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ చేతికి చిక్కాడు. మహ్మద్ రిజ్వాన్ vs మతీషా పతిరానా పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మహ్మద్ రిజ్వాన్ మరో బలమైన ప్లేయర్.
శ్రీలంకపై పాక్ పైచేయి
ఇతన్నిపెవీలియన్ పంపేందుకు పతిరానాకు బంతి అప్పగించొచ్చు.2023లో రిజ్వాన్ 17 వన్డేల్లో 63.27 సగటుతో 696 పరుగులు చేశాడు. మరోవైపు ఈ ఏడాది అరంగేట్రం చేసినప్పట్నుంచి పతిరానా 11 వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టాడు. కుసాల్ మెండిస్ vs షాదాబ్ ఖాన్ కుశాల్ మెండిస్,ఈ ఏడాది 23 వన్డేల్లో 35.52 సగటుతో 675 పరుగులు చేశాడు.6 అర్ధసెంచరీలు చేశాడు. షాదాబ్ ఖాన్ 32.95 సగటుతో 84 వన్డే వికెట్లు తీశాడు. మెండిస్ 38 ODI ఇన్నింగ్స్‌లలో 85.93 స్ట్రైక్ రేట్‌తో 15 సార్లు లెగీస్‌కి చిక్కాడు. రెండు జట్లు 156 మ్యాచ్‌ల్లో తలపడగా, వీటిలో SLకి 59 విజయాలుండగా, పాకిస్తాన్ 92 మ్యాచుల్లో గెలిచింది. 1 మ్యాచ్ టై, 4 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు.