World Cup 2023 : ప్రపంచకప్ లో పాకిస్థాన్ బోణి.. నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన పాక్
ప్రపంచ కప్ మ్యాచుల్లో పాకిస్థాన్ బోణి కొట్టింది.ఈ మేరకు నెదర్లాండ్స్ జట్టుపై భారీ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్, ఛేజింగ్ లో పర్వాలేదనిపించింది.పాక్ బౌలర్ల థాటికి ఉన్నట్టుండి వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే 41 ఓవర్లలో 205 వద్ద ఆలౌటైంది.దీంతో 81 పరుగుల భారీ ఓటమిని ముటగట్టుకుంది. నెదర్లాండ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుతేజం నిడమనూరు తేజ మ్యాచ్ లో విఫలమయ్యాడు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ భారం మోసిన బాస్ డీ లీడ్ 67 రన్స్ చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరగడంతో ఓటమి ఖరారైంది.