IPL 2023 Points Table: ఢిల్లీ గెలిచినా చివరిస్థానంలోనే.. మూడోస్థానంలో వార్నర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదారాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే పాయింట్ల పట్టికలో ఢిల్లీ స్థానం మారలేదు. విజయం సాధించినా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చైన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, మూడో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కొనసాగుతున్నాయి. నాలుగు, ఐదు స్థానంలో గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిలిచాయి.
ఇక సన్ రైజర్స్ పై 21 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడిన వార్నర్ 306 పరుగులు చేశాడు.
Details
పర్పుల్ క్యాప్ లిస్టులో సిరాజ్ అగ్రస్థానం
405 పరుగులు చేసిన డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 314 పరుగులతో డెవాన్ కాన్వే రెండో స్థానంలో, 279 పరుగులతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో 13 వికెట్ల సిరాజ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అర్షదీప్ 13 వికెట్లతో రెండో స్థానంలో, 12 వికెట్లతో చాహల్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇక ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.